ప్రభుదేవా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ లో కూడా  తనదైన శైలిలో దూసుకుపోతున్న హీరో.. ఈయన కేవలం హీరోగానే కాకుండా డైరెక్టర్ గా డాన్సర్ గా కూడా ఎంతో పాపులరిటి పొందారు. అలాంటి మల్టీ టాలెంట్ ఉన్నటువంటి ప్రభుదేవా  సినీ జీవితంలో ఎంతో సక్సెస్ అయినా కానీ తన సొంత కెరియర్ లో మాత్రం కాస్త గాడి తప్పారని చెప్పవచ్చు. తాను మొదట రమలత అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం కలిగిన తర్వాత కొన్నాళ్లకు టీనేజ్ లో ఉన్నటువంటి ఒక అబ్బాయి మరణించాడు. అప్పటినుంచి ఈ భార్యాభర్తల మధ్య కాస్త విభేదాలు ఏర్పడి విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే వీరి విడాకులకు కారణం  నయనతార అని రమాలత అప్పట్లో మీడియా ముందే చెప్పేసింది. 

వీరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత 50 ఏళ్ల వయసులో ప్రభుదేవా మళ్లీ ఫిజియోథెరపిస్టు హిమానిని వివాహం చేసుకున్నారు. వారికి ఒక పాప పుట్టింది. ఇదంతా బాగానే ఉన్న సమయంలో రమలత తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభుదేవా గురించి ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టింది. ప్రభుదేవాకు నా పిల్లలు అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ వారిని చాలా అపురూపంగా చూసుకుంటాడు. తన ఇద్దరు కొడుకులతో ఆయనకు మంచి అనుబందం ఉంది ఇప్పటికి వారు బయటకు వెళ్లాలంటే తండ్రికి ఫోన్ చేసి పర్మిషన్ తీసుకుంటారు. ఇక పెద్దకొడుకు రిషి మాత్రం తండ్రిలాగే డ్యాన్సులో అదరగొట్టేస్తారు. 

ఇక చిన్నోడు మాత్రం సినిమాల పైన గాని డ్యాన్స్ పైన కానీ ఏమాత్రం  ఇంట్రెస్ట్ చూపడు. వాడికి డాక్టర్ కావాలన్నది కోరిక. అయితే ఇద్దరు పిల్లల భవిష్యత్తును ప్రభుదేవా చూసుకుంటూనే ఉంటారు. ఇప్పటికి వారు ఏది అడిగినా తెచ్చిస్తుంటారు. ఇప్పటికీ మాకు విడాకులు అయినా కానీ మా మధ్య ఎలాంటి గొడవలు లేవు పైగా  పిల్లల కేరింగ్ కూడా ఆయనే చూసుకుంటున్నారు అని ప్రభుదేవా భార్య రమలత  చెప్పుకొచ్చింది. విడాకులు ఉన్నా కానీ ప్రభుదేవాను నేను చచ్చే వరకు వదిలిపెట్టనంటూ  చెప్పకనే చెప్పేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: