టాప్ హీరోల సినిమాల నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగిపోవడంతో తమ సినిమాల విడుదల తేదీలను చాల ముందుగానే ప్రకటించి తమ సినిమాల విడుదల విషయంలో ఎటువంటి పోటీ లేకుండా చాల జాగ్రత్తలు చాల ముందుగా తీసుకుంటున్నారు. ఈక్రమంలో వచ్చే ఏడాది మార్చి 26 - 27 తేదీలలో ఒకదానిపై  ఒకటి పోటీగా విడుదల కాబోతున్న నాని ప్యారడైజ్ రామ్ చరణ్ పెద్ది సినిమాల గురించి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలు చాల ఆశక్తిగా మాట్లాడు కుంటున్నాయి.



అయితే ఈరెండు సినిమాలకు పోటీ ఇస్తూ కేవలం ఒక వారం రోజుల ముందు విడుదలకాబోతున్న మరొక భారీ సినిమా ‘టాక్సిక్’ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. వాస్తవానికి ఇది డబ్బింగ్ సినిమా అయినప్పటికీ ఈ మూవీలో నటిస్తున్న హీరో యష్ కు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది.



‘కేజీ ఎఫ్’ మూవీ తరువాత యష్ పేరు తెలుగు రాష్ట్రాలలో కూడ మారుమ్రోగి పోతోంది. అతడికి తెలుగు రాష్ట్రాలలో కూడ అనేకమంది అభిమానులు ఉన్నారు. భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈమూవీ మార్కెట్ కూడ చాల భారీ స్థాయిలో జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు భారీ స్థాయిలో గ్రాఫిక్స్ తో కూడిన విజువల్స్ ఈమూవీలో ఉంటాయని ఎవరు ఊహించని ఒక డిఫరెంట్ కథతో నిర్మాణం జరుపుకోబోతున్న ఈమూవీలో యష్ తో పాటు నయనతార పాత్రకు సైతం చాలా ప్రాధాన్యం ఉంటుందని ఆమెకు హీరోకి మధ్య ఉన్న బాండింగ్ కథలో కీలకమైన మలుపులు ఉంటాయని కన్నడ మీడియా వార్తలు వ్రాస్తోంది.  



వాస్తవానికి ప్యారడైజ్ ‘’పెద్ది’ మూవీలు కూడ భారీ బడ్జెట్ తో తీస్తున్నవి. ఈమూవీలకు సంబంధించిన బిజినెస్ కూడ చాల భారీ స్థాయిలో జరుగుతోంది. మార్చి 21న రన్బీర్ కపూర్ సంజయ్ లీలా భన్సాలీ ‘లవ్ అండ్ వార్’ మూవీ కూడ విడుదల కాబోతోంది. అయితే యిన్ని భారీ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ఒకే నెలలో విడుదల అయ్యే ఆస్కారం ఎంతవరకు ఉంటుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: