
గత ఏడాది మహారాజు అనే చిత్రంలో కూడా బాలీవుడ్ లో నటించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న షాలిని పాండే బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ పైన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు తెలియజేసింది.. రణబీర్ కపూర్ తో తాను రొమాన్స్ చేయడానికి చాలా కోరికతో ఉన్నానని అందుకోసం చచ్చిపోవడానికైనా సిద్ధంగానే ఉన్నానని తెలియజేసింది. నాకు ఆయన అంటే చాలా ఇష్టమని అతనితో కలిసి నటిస్తే బాగుంటుందని ఎన్నోసార్లు అనుకున్నానని కానీ ఇప్పటివరకు అవకాశం రాలేదు. ఆయన నటన అంటే తనకు పిచ్చి అని తెలియజేసింది షాలిని పాండే.
రణబీర్ కపూర్ కళ్ళు చూస్తే చాలా మత్తెక్కించేలా ఉంటాయి. ఆయన ఏం చేస్తారో తెలియదు అతని ముఖాన్ని కదిలించకపోయిన కూడా తన కళ్ళతోనే ఒక మ్యాజిక్ చేయగలరు రణబీర్ కళ్ళతోనే హృదయంలో ఉన్న భావాలను కూడా వ్యక్త పరుస్తారంటూ తెలియజేసింది షాలిని పాండే. మొత్తానికి తాను రణబీర్ కపూర్ తో నటించడానికి చచ్చిన పరవాలేదు అంటూ చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. షాలిని పాండే మాట్లాడిన వ్యాఖ్యలను రణబీర్ కి సైతం ట్యాగ్ చేస్తూ ఏదైనా సినిమాలో అవకాశం ఇవ్వాలి అంటు పలువురు అభిమానులు డిమాండ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో అలాంటి అవకాశం వస్తుందో రాదో చూడాలి.