టాలీవుడ్ స్టార్ నాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా మూవీ హిట్ 3 ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .. ఇక ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెర్కక్కిస్తుండగా పూర్తి యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉంది .. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకులలో ఈ సినిమా పై అంచనాలు భారీ స్థాయి తో పెంచేసాయి .. అలాగే ఈ సినిమా నుంచి ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందని కూడా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ..


అయితే ఇప్పుడు ఈ సినిమా యూనిట్ ట్రైలర్ ను ఈ నెల 14న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది .. అయితే ఇప్పుడు తాజాగా ఈ ట్రైలర్ రిలీజ్ టైంను కూడా మేకర్స్ కన్ఫామ్ చేశారు .. ఇక హిట్ 3 ట్రైలర్ ను ఏప్రిల్ 14న ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్టు సినిమా యూనిట్ ప్రకటించింది .. అలాగే ఈ ట్రైలర్లో అర్జున్ సర్కార్ సూచించే రక్తపాతం ఎలా ఉంటుందో శాంపుల్ చూస్తారని కూడా చిత్ర యూనిట్ చెబుతుంది .. ఇక ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తుండగా ఈ సినిమాను మే 1న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు ..


ఇప్పటికే దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్ , హిట్ 2 సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయనగలు సాధించాయి .. ఇక ఎప్పుడు హీట్ 3 కూడా ఊహించిన సక్సెస్ అవుతుందని కూడా అంటున్నారు .. అలాగే ఇప్పుడు వచ్చి హిట్ 3కి  కంటిన్యూగా హిట్ 4కూడా రాబోతుందట .. అందులో ఓ కోలీవుడ్ స్టార్ హీరో నటించబోతున్నారు అని కూడా అంటున్నారు . అయితే ఇప్పుడు ఈ హిట్ సినిమాలతో నాని బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచనాల క్రియేట్ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: