
సౌత్ మాస్ మసాలా స్టోరీకి కొంచెం బాలీవుడ్ టచ్ కూడా ఇచ్చాడు . ఇక నిన్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది .. గాదర్ 2 తర్వాత సన్నీ నుంచి వస్తున్న సినిమా కావటంతో బాలీవుడ్ లో ఈ సినిమా పై భారీగా అంచనాలు ఉన్నాయి ట్రైలర్ సహాయ ప్రోమోలన్నీ అన్నీ కూడా ప్రేక్షకులు ఎంతగానో ఆకర్షించాయి .. గురువారం భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన జాట్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది . గత కొన్ని సంవత్సరాలగా సౌత్ మసాలా సినిమాలకు బాగా అలవాటు పడ్డ హిందీ ప్రేక్షకులు సన్నీ డియోల్‌ను సౌత్ టచ్ ఉన్న జాట్ సినిమాను చూడడానికి బాగా ఆకర్షితులు అవుతున్నారు .. అలాగే ఈ సినిమాలో ఉన్న మాస్ మసాలా సన్నివేశాలకు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి ..
అర్బన్ , రూరల్ ఇలా అన్ని ఏరియాలోను జాట్ కు టాక్ థియేటర్ రెస్పాన్స్ కూడా బాగుంది .. రివ్యూలు కూడా అన్ని పాజిటివ్ గానే ఉన్నాయి .. ఈ సినిమా ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి .. ఇక ఈ సినిమా చూసిన తెలుగు ప్రేక్షకులు చాలామంది చెబుతున్న అభిప్రాయం ఏమిటంటే .. రవితేజ ఓ పెద్ద హిట్ ను అందుకుని అవకాశం మిస్ అయ్యాడని మాస్ మహారాజా కు అయితే ఈ సినిమా ఇంకా పర్ఫెక్ట్ గా ఉండేదని తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరించే వారిని క్రాక్‌ను మించి పెద్ద హీట్ అయ్యేది అని కూడా అంటున్నారు .. బడ్జెట్ సహా ఎలాంటి సమస్య ఉన్న తెలుగులో ఈ సినిమా తీసి ఉంటే బాగుండేదని కూడా వారు కామెంట్లో చేస్తున్నారు. ఇక మరికొందరు రవితేజ ఇలాంటి మాస్ మసాలాలు ఇప్పటికే చాలా చేశాడని, మనవాళ్ళకి కూడా అంతగా నచ్చేది కాదు, రవితేజ చేయకపోవడమే మంచింది అయ్యిందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.