సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో వస్తున్నా  “ SSMB29 ” మూవీ షూటింగ్ ఎంతో శరవేగంగా జరుగుతుంది .. ఈ ప్రతిష్టాత్మక గ్లోబల్ సినిమా కి సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరాలు అందిస్తున్నారు .  అలాగే ఈ గ్లోబల్ సినిమా లో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా , మలయాళ స్టార్‌ పృథ్విరాజ్ కూడా కీలకపాత్ర లో నటిస్తున్నారు .. ఇక రీసెంట్ గా ఒడిశాలో కొరాపుట్ జిల్లా లో ఈ సినిమా కు సంబంధించిన రెండో షెడ్యూల్ ను పూర్తి చేసిన ఈ సినిమా యూనిట్ .. ఇప్పుడు తన తదుపరి షెడ్యూల్ కు రెడీ అవుతుంది .. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ తేదీ పై ఇప్పుడు ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ..
 

ప్ర‌స్తుతం సినీ వర్గాల్లో  వినిపిస్తున్న సమాచారం ప్రకారం .. ఈ సినిమా ని 2027 మార్చ్ 25 న రిలీజ్ చేయాలని ఆలోచనలో రాజమౌళి ఉన్నారట .  ఇక ఇదే తేదీ న 2022 లో రిలీజ్ అయిన త్రిబుల్ ఆర్ ప్రపంచవ్యాప్తం గా సంచలన విజయం సాధించింది .. ఇక ఇప్పుడు ఇదే డేట్ రాజమౌళి కి ఎంతో ప్రత్యేకమైన సెంటిమెంట్ గా మారిపోయింది .  ఇక ఇదే సెంటిమెంట్ తో రాజమౌళి , మహేష్ బాబు సినిమా ని కూడా రిలీజ్ చేయాల ని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే లేటెస్ట్ ఏఐ టెక్నాలజీ తో యాక్షన్ అండ్ అడ్వెంచర్ ఎలిమెంట్స్ తో రూపొందుతు న్న ఈ సినిమా ని దాదాపు రూ . 1500 కోట్ల బడ్జెట్ తోతెరకెక్కిస్తున్నారు .. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు పెరిగిపోయాయి .. ఇక మరి మహేష్ , రాజమౌళి కాంబో బాక్సాఫీస్ దగ్గర ఇంకెన్ని సెన్సేషన్ క్రియేట్ చేసిందో చూడాలిలి .

మరింత సమాచారం తెలుసుకోండి: