
అయితే ఇప్పుడు తాజాగా ఆస్కార్ అవార్డ్స్ వారు ఇకనుంచి ఓ కొత్త క్యాటగిరీని పరిచయం చేయబోతున్నారు . ఇక కొత్త వార్షిక అవార్డు గా ఇకనుంచి స్టంట్ డిజైన్ క్యాటగిరీని కూడా అనౌన్స్ చేశారు .. అయితే ఈ అనౌన్స్మెంట్ లో హాలీవుడ్ సినిమాలు ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్ (Everything Everywhere All at Once) , వీటితోపాటు టామ్ క్రూయిస్ మిషన్ ఇంపాజిబుల్ (Mission Impossible) ఈ సినిమాలో స్టాండ్ పోస్టర్ తో పాటు త్రిబుల్ ఆర్ నుంచి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్టంట్ ని కూడా ఇది యాడ్ చేసి దీనిని అనౌన్స్ చేశారు .. ఇక దీంతో ఇది చూసిన రామ్ చరణ్ అభిమానులు ఎంతగానో ఎగ్జైట్ అవుతున్నారు.
అయితే ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమా కి ఎలాంటి అవకాశం లేదు .. కానీ రామ్ చరణ్ నుంచి వచ్చే తర్వాత సినిమాలో త్రిబుల్ ఆర్ తరహా నాచురల్ స్టంట్స్ పడితే మాత్రం ఆస్కార్స్ లో నామినేట్ అయ్యేందుకు అవకాశం ఉండొచ్చు ఎందుకంటే వారు ఈ అవార్డుల్ని 2027 లో రిలీజ్ అయ్యే సినిమాల నుంచి స్టార్ట్ చేయబోతున్నారట . ఈ విధంగా 2028 లో 2027 లో విడుదలైన సినిమాల గాను ఈ అవార్డులు ఇవ్వబోతున్నట్టు ఆస్కార్ వారు కన్ఫర్మ్ చేశారు .. దీన్నిబట్టి అక్కడ నుంచి వచ్చే సినిమాలకు స్టంట్స్ సాలిడ్ గా ఉంటే తప్ప ఆస్కార్ నామినేషన్లో ఎంపిక కావు.