ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ,సినీ నటుడు పవన్ కళ్యాణ్ గత కొన్నేళ్లుగా నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా ఒక పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తూ ఉన్నారు. మొదట ఈ చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించగా ఆ తర్వాత కొన్ని కారణాల చేత పక్కకు తప్పుకోవడంతో మరొక డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు ఇందులో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తూ ఉంది.


ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ , సాంగ్స్, గ్లింప్స్ సైతం బాగానే ఆకట్టుకున్నాయి. ఇందులో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, బాబీ డియోల్ వంటి వారు కూడా కీలకమైన పాత్రలో నటిస్తూ ఉండడం గమనార్హం. కీరవాణి సంగీతాన్ని అందిస్తూ ఉన్నారు అయితే ఇప్పటివరకు ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూశారు. కానీ ఎన్నోసార్లు ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ సినిమా మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ గా ఒక పోస్టర్ ద్వారా తెలియజేశారు.


ఈ సందర్భంగా హరిహర వీరమల్లు సినిమా అప్డేట్ సైతం మేకర్స్ పంచుకుంటూ రీ రికార్డింగ్, విఎఫ్ఎక్స్ డబ్బింగ్ పనులు జరుగుతున్నాయని మే 9వ తేదీన కచ్చితంగా పవన్ కళ్యాణ్ నట విశ్వరూపం చూడడానికి సిద్ధంగా ఉండండి అంటూ అభిమానులకు  ఒక పోస్టర్ ను రిలీజ్ చేస్తూ రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు. మొత్తానికి ఎన్నో ఏళ్లుగా ఈ సినిమా కోసం చిత్ర బృందం కష్టపడుతూనే ఉంది. వాస్తవానికి ఎప్పుడో రిలీజ్ కావలసి ఉండగా పవన్ కళ్యాణ్ షూటింగ్ కోసం డేట్స్ ఆలస్యం అవ్వడం చేత ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: