
ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు అన్ని కంప్లీట్ అయిపోయాయి . ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరిని పెట్టుకుంటారు అనేది క్వశ్చన్ మార్క్ గా ట్రెండ్ అవుతుంది. చాలామంది చాలా స్టార్ హీరోయిన్స్ పేర్లు బయటికి చెబుతున్నారు . కానీ ఇప్పుడు ఎవరు ఊహించని పేరు తెరపైకి వచ్చింది. కాల్ షీట్స్ ఎక్కువగా బిజీగా ఉండే హీరోయిన్స్ ని అనిల్ రావిపూడి చూస్ చేసుకోరు . అది అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఆయన ఓ హీరోయిన్ కి బిగ్ ఛాన్స్ ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది . ఆమె మరి ఎవరో కాదు రాశి ఖన్నా.
రాశి ఖన్నా ఇండస్ట్రీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . అయితే స్టార్ హీరోయిన్ గా మాత్రం మారలేకపోయింది . రాశి ఖన్నా వచ్చిన అవకాశాలలో సినిమాలు చేస్తూ టైం పాస్ చేస్తుంది. కాగా ఇప్పుడు చిరంజీవికి జోడిగా రాశిఖన్నాను. చూస్ చేసుకుంటున్నారట అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి డిఫరెంట్ కాంబోలని సెట్ చేస్తూ ఉంటారు . అసలు వెంకటేష్ కి తమన్న సూట్ అవుతుందా..? అని జనాలు ఆశ్చర్యపోయారు . ఇక వెంకటేష్ పక్కన ఐశ్వర్యరాజేష్ కూడా అదే రేంజ్ లో చూపించారు . ఇప్పుడు చిరంజీవి - రాశీఖన్నా ని ఎలా చూపించబోతున్నాడు అంటూ మాట్లాడుకుంటున్నారు . అయితే చాలామంది మాత్రం వీళ్ళిద్దరి కాంబో సెట్ అవ్వదు అని .. అనిల్ రావిపూడి ఎందుకు ఈ విషయంలో రాంగ్ స్టెప్ తీసుకుంటున్నారు అని మాట్లాడుకుంటున్నారు.. దీనిపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి మరి..???