
14 రోజుల్లో ఈ సినిమాకు కేరళ ఏరియాలో 82.55 కోట్ల కలెక్షన్లు దక్కగా , తెలుగు రాష్ట్రాల్లో 4.40 కోట్లు , తమిళనాడులో 9.65 కోట్లు , కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 22.10 కోట్లు , ఓవర్సీస్ లో 141.75 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు 14 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 122.95 కోట్ల షేర్ ... 260.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ 102 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇక 14 రోజుల్లో ఈ సినిమాకు 20.95 కోట్ల రేంజ్ లో లాభాలు వచ్చాయి. ఇక ఈ వారం కూడా పెద్ద క్రేజ్ ఉన్న సినిమాలు ఏవి కూడా మలయాళ ఇండస్ట్రీలో విడుదల కాకపోవడంతో ఈ మూవీ కి ఈ వారం రోజుల పాటు కూడా మంచి కలెక్షన్లు మలయాళ బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.