టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అక్కినేని నాగార్జున నట వారసులుగా నాగ చైతన్య , అఖిల్ ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో నాగ చైతన్య ఇప్పటికే చాలా సినిమాలలో హీరోగా నటించి ఎన్నో సినిమాలతో మంచి విజయాలు అందుకొని నటుడిగా తనను తాను చాలా సార్లు ప్రూవ్ చేసుకున్నాడు. ఇకపోతే అఖిల్ , వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అఖిల్ అనే మూవీ తో హీరో గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత అఖిల్ చాలా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఒక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీని మినహాయిస్తే ఏ సినిమాతో కూడా ఈయనకు విజయం దక్కలేదు.

ఆఖరుగా అఖిల్ "ఏజెంట్" అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే తాజాగా అఖిల్ నెక్స్ట్ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. అలాగే ఆ సినిమాకు సంబంధించిన గ్లీమ్స్ వీడియోను కూడా ఈ మూవీ బృందం వారు విడుదల చేశారు. అఖిల్ నెక్స్ట్ మూవీ లెనిన్ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటించబోతుంది. ఇకపోతే ఈ మూవీ గ్లీమ్స్ వీడియో అద్భుతంగా ఉన్నప్పటికీ ప్రేక్షకుల నుండి భారీ రేంజ్ లో రెస్పాన్స్ని తెచ్చుకోవడంలో విఫలం అయింది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ గ్లీమ్స్ వీడియోను రెండు చానల్లో విడుదల చేయగా ఈ మూవీ గ్లీమ్స్ వీడియోకు విడుదల అయిన 24 గంటల్లో ఒక ఛానల్ లో 2.1 మిలియన్ వ్యూస్ దక్కగా , మరో దాంట్లో 2.5 లక్షల వ్యూస్ మాత్రమే దక్కాయి. ఇక లైక్స్ పరంగా ఒక ఛానల్లో 90 వేల రేంజ్ లో లైక్స్ దక్కగా , మరో ఛానల్లో 12 వేల లైక్స్ మాత్రమే దక్కాయి. ఓవరాల్ గా చూసుకుంటే లెనిన్ గ్లీమ్స్ వీడియో సూపర్ గా ఉన్న ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ను తెచ్చుకోవడంలో విఫలం అయింది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: