మాస్ మహారాజా రవితేజ ఈ మధ్య కాలంలో చాలా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈయన ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా బోల్తా కూడదు వస్తున్నాయి. ఆఖరిగా రవితేజకు ధమాకా మూవీ తో మంచి విజయం దక్కింది. ఆ సినిమా తర్వాత రవితేజకు సరైన విజయం లేదు. ఆఖరుగా రవితేజ "మిస్టర్ బచ్చన్" అనే సినిమాలో హీరోగా నటించాడు. హరీష్ శంకర్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం రవితేజ "మాస్ జాతర" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ మూవీ విడుదల విషయంలో రవితేజ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... మాస్ జాతర సినిమా మొదలు అయిన తర్వాత కొంత కాలానికి ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దానితో తమ అభిమాన నటుడి సినిమా సంక్రాంతికి వస్తుంది అని రవితేజ అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. కానీ ఆ తర్వాత ఈ సినిమాను సంక్రాంతి బరి నుండి తప్పిస్తున్నట్లు మే 9 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దానితో సంక్రాంతికి రాకపోయినా పర్లేదు మే 9 కి వస్తే చాలు అని ఈయన అభిమానులు భావించారు.

ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మాస్ జాతర సినిమాని మే 9 వ తేదీన కూడా విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ లేరు అని , ఈ మూవీ ని జూలై 18 వ తేదీన విడుదల చేయనున్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరో కొన్ని రోజుల్లో రానున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇలా ఈ సినిమా విడుదల విషయంలో వస్తున్న వార్తలతో రవితేజ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: