నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న హిట్ ది థర్డ్ కేస్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే హిట్ ది ఫస్ట్ కేస్ , హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీలు మంచి విజయాలను సాధించి ఉండడం , హిట్ ది థర్డ్ కేస్ మూవీ నుండి ఇప్పటి వరకు మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు కూడా అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే నాని ఇప్పటికే శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో ది ప్యారడైజ్ అనే సినిమాకు కమిట్ అయిన విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి చాలా కాలమే అవుతుంది. ఇప్పటికే నాని , శ్రీకాంత్ కాంబోలో వచ్చిన దసరా మూవీ మంచి విజయం సాధించి ఉండడంతో  ది ప్యారడైజ్ మూవీ పై ప్రేక్షకుల్లో మొదటి నుండి మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుండి మేకర్స్ ఓ గ్లీమ్స్ వీడియోను విడుదల చేశారు. ఆ గ్లిమ్స్ వీడియో ప్రేక్షకులను ఆధ్యాతం ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు అమాంతం పెరిగి పోయాయి. ఇకపోతే తాజాగా ది ప్యారడైజ్ మూవీ షూటింగ్ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ది ప్యారడైజ్ మూవీ షూటింగ్ను మే 2 వ తేదీ నుండి మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా విడుదల తేదీని ఈ మూవీ గ్లిమ్స్ వీడియోతో పాటే అనౌన్స్ చేశారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి 26 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక మే 2 వ తేదీన ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేస్తే మార్చి 26 వ తేదీ వరకు ఈ మూవీ కి సంబంధించిన అన్ని పనులను కంప్లీట్ చేసి ఈ మూవీ ని చెప్పిన తేదీకి విడుదల చేయడం జరుగుతుందా లేదా అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: