ఒక్కో సినిమా ఇండస్ట్రీలో ఒక జోనర్ సినిమాలను అత్యంత బాగా ప్రేక్షకులు ఇష్టపడుతుంటారు. ఇప్పటివరకు తెలుగులో ఓ జోనర్ కి సంబంధించిన సినిమాలు చాలానే వచ్చాయి. కానీ ఆ జోనర్ సినిమాలలో చాలా శాతం మూవీలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన డిజాస్టర్లుగా నిలిచాయి. మరి అంతగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొని ఆ జోనర్ సినిమాలేవో తెలుసా ..? ఆ జోనర్ మరేదో కాదు ... స్పై ఎంటర్టైనర్ జోనర్ మూవీస్. ఇప్పటివరకు తెలుగులో స్పై జోనర్ మూవీలు చాలానే వచ్చాయి. కానీ అందులో చాలా శాతం మూవీలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.

కొంత కాలం క్రితం అక్కినేని అఖిల్ "ఏజెంట్" అనే స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2023 వ సంవత్సరం మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ అయ్యింది. ఇకపోతే టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ కొంత కాలం క్రితం స్పై అనే స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటించాడు. ఈ మూవీ కూడా 2023 వ సంవత్సరం విడుదల అయింది. ఈ మూవీ కూడా భారీ డిజాస్టర్ అయింది. ఇకపోతే తాజాగా టాలీవుడ్ యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ , బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జాక్ అనే స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు.

మూవీ తాజాగా థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే నెగటివ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు దక్కుతున్న కలెక్షన్లను చూస్తూ ఉంటే ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది భావిస్తున్నారు. ఇలా తెలుగులో వచ్చిన స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలు వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతూ ఉండడంతో స్పై జోనర్ మూవీలకి తెలుగు ప్రేక్షకుల నుండి పెద్దగా రెస్పాన్స్ రావడం లేదు అని చాలా మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: