ఈ మధ్య కాలంలో కొంత మంది ప్రేక్షకులు థియేటర్ కి వెళ్లి సినిమా చూడడం కంటే కూడా ఓ టీ టీ లోకి సినిమా వచ్చాక కుటుంబంతో కలిసి ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా సినిమా చూడడానికి ఇష్టపడుతూ వస్తున్నారు. ఇలా ఓ టి టి లో సినిమాలను చూసే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో అనేక ఓ టి టి ప్లాట్ ఫామ్ లు పుట్టుకొస్తున్నాయి. అలాగే ఓ టి టి లోకి ప్రతి వారం కొత్త కంటెంట్ కూడా వచ్చేస్తుంది. ఇకపోతే కొంత కాలం క్రితం విడుదల అయ్యి భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న ఓ సినిమా తాజాగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

అసలు విషయం లోకి వెళితే ... బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ తాజాగా ఛావా అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి రష్మిక మందన హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మొదట హిందీ భాషలో ఈ సంవత్సరం ఫిబ్రవరి 14 వ తేదీన విడుదల అయ్యి బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకొని అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసింది. దానితో ఈ సినిమాను ఆ తర్వాత కొన్ని రోజులకు తెలుగులో కూడా విడుదల చేశారు. ఈ మూవీ టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది.

ఇలా అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్లను వసూలు చేసిన ఈ సినిమా తాజాగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క ఓ టీ టీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓ టి టి సంస్థ వారు ఛావా సినిమాను తమ ఓ టీ టీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. మరి బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమాకి ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ott