అక్కినేని ఫ్యాన్స్ కి ఇది నిజంగా పండగ లాంటి న్యూస్ అనే చెప్పాలి . అఖిల్ అక్కినేని పెళ్లి డేట్ త్వరలోనే అఫీషియల్ గా ప్రకటించబోతున్నట్లు అక్కినేని ఫ్యామిలీ నుంచి ఓ న్యూస్ బయటకు వచ్చింది. అఖిల్ అక్కినేని తన గర్ల్ ఫ్రెండ్ జైనబ్ రవ్జీ తో నిశ్చితార్ధం చేసుకున్నాడు . వీళ్ళ పెళ్లి మార్చ్ 24వ తేదీ జరగాలి కానీ కొన్ని కారణాల చేత అది ఆగిపోయింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి . ఫైనల్లీ అఖిల్ అక్కినేని తన పెళ్లి చేసుకోబోతున్నాడట . అది కూడా ఒక స్టార్ హీరో పెళ్లిరోజునే. దీంతో అటు ఆ హీరో ఫ్యాన్స్..ఇటు ఈ హీరో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రసెంట్ ఇదే టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.


దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అఖిల్ అక్కినేని జైనబ్ రవ్జీ ప్రేమించుకున్నారు . కుటుంబ సభ్యులకు చెప్పి వాళ్ళ  ప్రేమను పెళ్లి వరకు తీసుకొచ్చుకున్నారు.  రీసెంట్ గా నిశ్చితార్థం చేసుకున్నారు.  వీళ్ల పెళ్లి ముహూర్తం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం మే 5వ తేదీ వీళ్ళ పెళ్లి జరగబోతుందట.  అది కూడా దుబాయ్ లో.  ఆశ్చర్యమేంటంటే జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి ల పెళ్లికూడా మే 5వ తేదీన జరిగింది . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు .



యంగ్ టైగర్ ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్న అదే ముహుర్తానికి అఖిల్ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు .ఇక లైఫ్ మొత్తం జిల్ జిల్ జిగా అంటున్నారు ఫ్యాన్స్.  ప్రజెంట్ ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది. మొత్తానికి లెట్ గా పెళ్లి చేసుకున్న లెటేస్ట్ గానే చేసుకుంటున్నాడు ఈ అక్కినేని హీరో అంటూ ఫ్యాన్స్ కూడా బాగా హైప్ ఇస్తూ మాట్లాడుతున్నారు. చూద్దం కొత్త కోడలి రాక అక్కినేని ఫ్యామిలీకి ఎంత వరకు కలిసి వస్తుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: