టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ కలిగిన నటులలో అల్లరి నరేష్ ఒకరు. ఈయన అల్లరి అనే మూవీతో నటుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఇకపోతే తాజాగా నరేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా అల్లరి సినిమా సమయంలో జరిగిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ ... నేను అల్లరి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను. ఆ సినిమాకు రవిబాబు దర్శకత్వం వహించగా ... సురేష్ బాబు ఆ మూవీ ని నిర్మించాడు. ఆ మూవీ కి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది.

మూవీ విడుదల తేదీ కూడా దగ్గరకు వచ్చింది. ఒక రోజు నేను రవిబాబుతో మాట్లాడుతూ ఉన్నాను. అలాంటి సమయంలో ఆయన నన్ను సినిమాలో నీ పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేసుకున్నావా అని అడిగాడు. నేను లేదు అని చెప్పాను. దానితో ఆయన సినిమా విడుదల తేదీ దగ్గరకు వచ్చింది. తొందరగా కంప్లీట్ చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయాడు. దానితో నేను వెంటనే ఆ రోజు రాత్రి 11 గంటలకు ఆ సినిమా డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టి ఉదయం 5 గంటల వరకు మొత్తం డబ్బింగ్ కంప్లీట్ చేసుకున్నారు. ఇక సురేష్ బాబు గారికి పొద్దున్నే జాగింగ్ చేయడం అలవాటు. నేను డబ్బింగ్ పూర్తి చేసి డబ్బింగ్ థియేటర్ ముందు ఉన్నాను.

సురేష్ బాబు గారు జాగింగ్ చేస్తూ నా దగ్గరకు వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని అడిగాడు. దానితో నేను డబ్బింగ్ కంప్లీట్ చేశాను అన్నాడు. దానితో ఆయన షాక్ అయ్యి ఇంత త్వరగా మొత్తం డబ్బింగ్ చెప్పావా అని అడిగాడు. అవును చెప్పాను సార్ అని అన్నాను. దానితో ఆయన లోపలికి వెళ్లి నేను చెప్పిన డబ్బింగ్ మొత్తం చూసి బాగా చెప్పావు అని చెప్పి వెళ్లిపోయాడు అని నరేష్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: