ఇప్పుడు ఎక్కడ చూసినా సరే అల్లు అర్జున్ గురించి జనాలు మాట్లాడుకునేది అట్లీ దర్శకత్వంలో తెరకెక్కే మూవీ నే. పుష్ప సినిమాతో తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్ ప్రెసెంట్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లే దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడు . అంతే కాదు ఈ సినిమా ఇప్పటివరకు అల్లు అర్జున్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతుందట. ఈ సినిమాలో ముందుగా సమంత, రష్మిక, జాన్వీ కపూర్ లాంటి స్టార్స్ ని అనుకున్నారట.


కానీ ఆ తర్వాత అలియా భట్ ని ఫైనల్లీ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.  అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి మరొక క్రేజీ అప్డేట్ లీకై వైరల్ అవుతుంది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఏకంగా 300 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడట . ఆశ్చర్యం ఏంటంటే ఈ సినిమా కోసం హీరో అల్లు అర్జున్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడో డైరెక్టర్ అట్లీ కూడా అంతే రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారట . సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది.  ఇండియన్ ఫిలిం హిస్టరీ లోనే ఫర్ ద ఫస్ట్ టైం ఒక హీరో ఒక డైరెక్టర్ ఈక్వల్ గా అది కూడా భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఈ న్యూస్  బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారిపోయింది.



నిజానికి లెక్క ప్రకారం బన్నీ పుష్ప సినిమా తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలి. ఇది ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ గా తెరకెక్కాల్సిన సినిమా. కానీ అట్లీ సినిమా మధ్యలోకి రావడంతో ఈ సినిమా హోల్డ్ లో పెట్టేశారట బన్నీ. పుష్ప సినిమా తరువాత అలాంటి ఓ పాన్ ఇండియా ఫిలిం చేస్తేనే బాగుంటుంది అంటూ త్రివిక్రమ్ శ్రీని వాస్ రావు కూడా బన్నీ కెరియర్ గురించి ఆలోచించి ఆయన తీసుకున్న డెసీషన్ కి ఓకే చెప్పారట..!

మరింత సమాచారం తెలుసుకోండి: