పాన్ ఇండియా స్థాయిలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ శర వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.. అలాగే ప్రభాస్ రాజాసాబ్ తో పాటు  హను రాఘవపూడి దర్శకత్వం లో ‘ఫౌజీ’అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా పూర్తయిన వెంటనే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘స్పిరిట్’అనే హై వోల్టేజ్ మూవీ చేయబోతున్నాడు.అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో సూపర్ పాపులర్ అయిన సందీప్ స్పిరిట్ సినిమా లో ప్రభాస్ ని మరింత పవర్ ఫుల్ గా చూపించనున్నాడు. సందీప్ రెడ్డివంగ సినిమాలో కొన్ని బోల్డ్ సీన్స్ ను పెట్టినప్పటికి ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాడనే నమ్మకం తో ఫ్యాన్స్ వున్నారు... అయితే ఈ సినిమాలో ప్రభాస్ కొద్ది సేపు సైకో టైప్ ఆఫ్ పాత్రలో కనిపించబోతున్నాడనే న్యూస్ వైరల్ అవుతుంది..

ప్రభాస్ పాత్ర ఎలా ఉంటుంది అంటే ఎవరు ఏం చెప్పినా వినిపించుకోకుండా ఒక సైకో లాగా బిహేవ్ చేసేలా ఉండనుంది.ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఎలా మారాడనేది సందీప్ ఎంతో వైల్డ్ గా చూపించనున్నట్లు సమాచారం.. అయితే సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా స్టోరీని ఎక్కడ రివీల్ చేయలేదు.. పోలీస్ పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడని తెలిపాడు..పైన తెలిపిన స్టోరీ మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

సందీప్ రెడ్డివంగ ప్రభాస్ సినిమా మీద భారీ బజ్ క్రియేట్ చేస్తున్నాడు. జూన్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.. ప్రభాస్ లుక్, బాడీ లాంగ్వేజ్ ఎంతో డిఫరెంట్ గా ఉండేలా సందీప్ చూసుకుంటున్నాడు.. అలాగే తన సినిమాకు ప్రాణం లాంటి మ్యూజిక్ విషయం లో కూడా సందీప్ చాలా కేర్ తీసుకుంటున్నారు.. ముఖ్యంగా బాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావడం లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: