తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న నటుడు మరియు నిర్మాత అయినటువంటి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తాజాగా కళ్యాణ్ రామ్ "అర్జున్ S/O వైజయంతి" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో అలనాటి స్టార్ నటీమణి విజయశాంతి , కళ్యాణ్ రామ్ కి తల్లి పాత్రలో నటించింది. ఈ మూవీ ని ఏప్రిల్ 18 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను విడుదల చేయగా అవి ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై ప్రస్తుతం ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇకపోతే రేపు అనగా ఏప్రిల్ 12 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ మూవీ బృంద వారు నిర్వహించనున్నట్లు , దానికి టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ ప్రచారాలలో భాగంగా కళ్యాణ్ రామ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కళ్యాణ్ రామ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా అర్జున్ S/O వైజయంతి  సినిమాలో అదిరిపోయే క్లైమాక్స్ ఉండబోతున్నట్లు , ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాంటి క్లైమాక్స్ ఏ సినిమాలో లేదు అని , అదిరిపోయే రేంజ్ లో క్లైమాక్స్ ఉండబోతుంది అని స్టేట్మెంట్ ఇచ్చాడు.

ఈ స్టేట్మెంట్ తో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇకపోతే కొంత కాలం క్రితం తారక్ "దేవర పార్ట్ 1" సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ప్రచారాలలో భాగంగా తారక్ "దేవర" లో ఆఖరి 40 నిమిషాలు అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. దానితో దేవర మూవీ ఆఖరి 40 నిమిషాలపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ సినిమా ఆఖరి 40 నిమిషాలు అంత గొప్పగా లేకపోవడంతో ప్రేక్షకులు కాస్త డిసప్పాయింట్ అయ్యారు. మరి కళ్యాణ్ రామ్ చెప్పిన విధంగా అర్జున్ S/O వైజయంతి సినిమా క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుంద లేదా అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

nkr