తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటలలో రామ్ పోతినేని ఒకరు. ఈయన వై వి ఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన దేవదాసు అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ను , మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత నుండి ఈయన ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. అందులో చాలా మూవీలు మంచి విజయాలను అందుకున్నాయి. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం రామ్ కి వరుస పెట్టి అపజయాలు దక్కుతున్నాయి.

కొంత కాలం క్రితం ఈయన ది వారియర్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించగా ఆ సినిమా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత ఈయన నటించిన స్కంద , డబల్ ఇస్మార్ట్ మూవీలు కూడా వరుసగా భారీ డిజాస్టర్ లను అందుకున్నాయి. ఇలా వరుసగా మూడు అపజయాలను అందుకున్న రామ్ ప్రస్తుతం మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందుతున్న రాపో 22 అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే రామ్ ప్రస్తుతం ఈ ఒక్క సినిమాలోని నటిస్తున్నాడు. మరే సినిమాకు కూడా కమిట్ కాలేదు.

కానీ రామ్ దగ్గరికి చాలా మంది దర్శకులు అనేక కథలతో వస్తున్నట్లు తెలుస్తోంది. కానీ రామ్ మాత్రం ఆ కథలను వినడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు అని వార్తలు వస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం ప్రస్తుతం రామ్ కేవలం  రాపొ 22 సినిమాపై మాత్రమే ఫోకస్ పెట్టాలి అని ఆలోచనలో ఉన్నట్లు , ఆ సినిమా విడుదల అయ్యాక దాని రిజల్ట్ ను బట్టి ఎలాంటి కథలను ఎంపిక చేసుకోవాలి అనే ఆలోచనలో రామ్ ఉన్నట్లు , అందుకోసం రాపో 22 సినిమా విడుదల అయ్యేవరకు ఏ సినిమాను కూడా ఓకే చేసే ఆలోచనలో రామ్ లేనట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: