కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో సూర్య ఒకరు. సూర్య ఇప్పటివరకు ఎన్నో తమిళ సినిమాలలో నటించి అందులో చాలా మూవీలతో మంచి విజయాలను అందుకొని తమిళ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అలాగే ఈయన తాను నటించిన అనేక సినిమాలను తెలుగులో విడుదల చేశాడు. అందులో కొన్ని సినిమాలు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి సక్సెస్ లను సాధించడంతో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఉంది. ఇకపోతే కొంత కాలం క్రితం సూర్య "కంగువ" అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరోగా నటించాడు.

అత్యంత భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని ఎదుర్కొంది. ఇకపోతే ప్రస్తుతం సూర్య , కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న రెట్రో అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాని మే 1 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితం విడుదల చేశారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ కి సంబంధించిన సాటిలైట్ హక్కులను ఇప్పటికే ఈ మూవీ యూనిట్ అమ్మివేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క సాటిలైట్ హక్కులను సన్ నెట్ వర్క్ వారు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా థియేటర్లలో విడుదల అయిన కొన్ని వారాలకు ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఆ తర్వాత కొన్ని వారాలకు సన్ నెట్ వర్క్ వారు తన ఛానల్ లో ఈ మూవీ ని ప్రసారం చేయనున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: