కమీడియన్ పాత్రలతో కెరియర్ను మొదలు పెట్టి ప్రస్తుతం హీరోగా వరుస పెట్టి సినిమాల్లో నటిస్తున్న వారిలో ప్రియదర్శి ఒకరు. ప్రియదర్శి తాజాగా సారంగపాణి జాతకం అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి తెలుగు సినీ పరిశ్రమలో మంచి దర్శకుడిగా గుర్తింపును సంపాదించుకున్న ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ఏప్రిల్ 18 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ వారు గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తున్నారు.

మూవీ బృందం వారు ఈ సినిమా ప్రచారాలను భారీ ఎత్తున నిర్వహిస్తూ రావడంతో ఈ సినిమాను ఖచ్చితంగా ఏప్రిల్ 18 వ తేదీన విడుదల చేస్తారు అని చాలా మంది ఫిక్స్ అయిపోయారు. ఇకపోతే అనూహ్యంగా ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉంది అని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తి అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను ఏప్రిల్ 18 వ తేదీన కాకుండా ఏప్రిల్ 25 వ తేదీన విడుదల చేయాలి అనే ఆలోచనకు మేకర్స్ వచ్చినట్లు , మరికొన్ని రోజుల్లోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ బృందం వారు విడుదల చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమాను ఏప్రిల్ 18 వ తేదీన విడుదల చేస్తారా ..? లేక ఆ తేదీన వాయిదా వేసి ఏప్రిల్ 25 వ తేదీన విడుదల చేస్తారా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇకపోతే ప్రస్తుతానికి సారంగపాణి జాతకం మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: