ఇక ‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , స్టార్ దర్శకుడు అట్లీ కాంబో లో ఓ సినిమా రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే .. రీసెంట్ గానే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భం గా ఈ సినిమా కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా బయటకు వచ్చేసింది .. అయితే ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది ?, ఎప్పుడు రిలీజ్ కాబోతుంది ? అంటూ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .. అయితే ఇప్పుడు ఈ సినిమా లో ప్రియాంక చోప్రా నటిస్తున్నారని టాక్‌ గట్టిగా వినిపిస్తుంది .. ఇదే క్రమంలో ఇప్పుడు మరో క్రేజీ హీరోయిన్ పేరు కూడా గట్టిగా వినిపిస్తుంది .. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ ని కూడా ఈ సినిమాలోకి తీసుకొని ఆలోచన లో చిత్ర యూనిట్ ఉందని కూడాా అంటున్నారు ..


అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముంది అనేది ఎవరికి తెలియదు .. కానీ అల్లు అర్జున్ కోసం అట్లీ ఎవరు ఊహించని పవర్ ఫుల్ కథ ను మాత్రం రెడీ చేశారని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది .. ఓ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈకథా నేపథ్యం సాగుతుందట .. ఈ సినిమా మెయిన్ కథాంశమే ఎంతో కొత్తగా ఉంటుంద ని .. ఇలా మొత్తానికి అల్లు అర్జున్ అట్టి నుంచి ఓ పవర్ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా రాబోతుందని వార్తలు కూడా వస్తున్నాయి .. అలాగే జీ స్టూడియోస్ కంపెనీ ఈ ప్రాజెక్టును నిర్మిస్తుంది అని  తెలిసిందే . ఇక త్వరలో నే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేసే  ప్లాన్లో ఉన్నారు మేకర్స్ .. అలాగే అట్లీ సినిమా పూర్తి అయిన తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో చెయ‌బోయే సినిమా ను మొదలు పెడతాడట .

మరింత సమాచారం తెలుసుకోండి: