డైరెక్టర్ క్రిష్ తాజాగా హీరోయిన్ అనుష్కతో ఘాటి చిత్రాన్ని తెరకెక్కిస్తే ఉన్నారు. ఇందులో ఈమె లేడీ ఓరియంటెడ్ పాత్రలో కూడా నటిస్తోంది. తన సొంత నిర్మాణ సంస్థలోనే డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాని రూపొందిస్తున్నారు. అటు పాన్ ఇండియా లెవెల్లో కూడా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో హీరోయిన్ అనుష్క, క్రిష్ కాంబినేషన్లో వచ్చిన వేదం సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వీరికి కలయికలు వస్తున్న ఘాటి సినిమా మీద కూడా భారీగానే బస్సు ఏర్పడింది.


ఇందులో తమిళ హీరో విక్రమ్ ప్రభు కూడా తెలుగు తెరకు మొదటిసారి పరిచయం కాబోతున్నారు. ఇందులో జగపతిబాబు ,రమ్యకృష్ణ వంటి వారు కూడా కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. గత కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోంది . గ్లింప్స్ విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఒక్కసారిగా ఈ సినిమా పైన అంచనాలు కూడా పెరిగిపోయాయి. ముఖ్యంగా అనుష్క ఈ సినిమాలో చాలా వైలెంట్ గా కనిపిస్తోంది. కొడవలి పట్టుకొని మరి పీకలు కోస్తున్న దృశ్యాలు అనుష్క క్యారెక్టర్ ను అభిమానులను బాగా ఆకట్టుకునేలా చేశాయి.


ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించడం జరిగింది ఏప్రిల్ 18న విడుదల చేస్తామంటూ ప్రకటించినప్పటికీ తాజాగా చూస్తూ ఉంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కడా కనిపించడం లేదు. మరి ఏడు రోజులలో ఈ సినిమాని రిలీజ్ చేస్తారా అంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఘాటి సినిమా గంజాయి నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఒక మాఫియా సినిమా అన్నట్లుగా కనిపిస్తోంది. డైరెక్టర్ క్రిష్ పవన్తో హరిహర వీరమల్లు సినిమా కోసం సుమారుగా ఐదేళ్లు కేటాయించారు.. అయితే ఆ తర్వాత ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకొని మరి అనుష్కతో సినిమాని మొదలుపెట్టగా ఈ సినిమా మీద ఆశలన్నీ పెట్టుకున్నారు. మరి డైరెక్టర్ ఆశలను అనుష్క నెరవేరుస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: