టాలీవుడ్ ఇండస్ట్రీలో హర్రర్ కామెడీ సినిమాలకు ఉండే డిమాండ్ అంతాఇంతా కాదు. సరికొ త్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఎన్నో హర్రర్ కామెడీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. రామ్ ప్రకాశ్ శ్రీజిత్, నిష్కల, రమ్య ప్రధాన పాత్రల్లో చెరసాల అనే సినిమా తెరకెక్కి తాజాగా ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందో లేదో ఇప్పుడు చూద్దాం.
 
కథ : వంశీ(శ్రీజిత్), ప్రియ(నిష్కల) ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఈ ప్రేమ జోడీని అభిమానించే స్నేహితులు సైతం ఎక్కువగానే ఉంటారు. అయితే సంతోషంగా, జాలీగా గడపడానికి ఇష్టపడే ఈ స్నేహితులు ఒకసారి ఎక్కడికైఅన వెళ్లి జాలీగా గడపాలని భావిస్తారు. అక్కడ వారు ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. ఈ విధంగా, కాపలాదారుల ద్వారా బంగ్లాల్లో ఒక దెయ్యం ఉంది అని తెలుస్తుంది. ఈ బంగ్లాలో ఆత్మ ఎవరు? ఆమెను ఎవరు చంపారు? బంగ్లాతో ఈ ఆత్మతో సంబంధం ఎలా ఉంది? ఆ ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
 
విశ్లేషణ :
 
దాంపత్య బంధం అంటే ఎలా ఉండాలి ? దంపతుల మధ్య గొడవలు వస్తే ఎలా ముందుకెళ్లాలి? భార్యాభర్తల మధ్య అపార్థాలు ఏర్పడితే చివరకు ఏమవుతుంది అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. అయితే కాన్సెప్ట్ కు హర్రర్ కామెడీ జోడించడం ప్లస్ అయింది. స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉండటం ఈ సినిమా సక్సెస్ కు కారణమైంది. కొన్ని సీన్లు బోరింగ్ అనిపించగా ఈ సీన్లు భారీ స్థాయిలో ఉండి ఉంటే సినిమ రేంజ్ మరింత పెరిగేది.
 
ఈ సినిమాలో ప్రధాన పాత్రలకు బాగానే ప్రాధాన్యత దక్కినా మిగతా పాత్రలకు మాత్రం ఆ స్థాయి ప్రాధాన్యత దక్కలేదని చెప్పవచ్చు. రామ్ ప్రకాశ్ ఈ సినిమాలో మంచి పాత్రను పోషించారు. కౌసల్య రోల్ లో రమ్య నటన ఆకట్టుకుంది. కన్నడ నటుడు శ్రీజిత్ ప్రియ పాత్రలో నిష్కల ఆకట్టుకున్నారు.
 
బలాలు : ప్రధాన నటీనటుల నటన, కామెడీ, హర్రర్ సన్నివేశాలు
 
బలహీనతలు : కొన్ని లాజిక్ లేని సీన్స్, కొన్ని సన్నివేశాల్లో ల్యాగ్
 
రేటింగ్ : 3.0/5.0
 


మరింత సమాచారం తెలుసుకోండి: