ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2”..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న రిలీజ్ అయి భారీ విజయం సాధించింది.. అల్లు అర్జున్ కెరీర్ లో పుష్ప 2 సినిమా తిరుగులేని విజయం సాధించింది.. ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది.. ఈ సినిమాలో మరోసారి శ్రీవల్లి పాత్రలో రష్మిక అద్భుతంగా నటించింది.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకే హైలైట్ గా నిలిచింది.. ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అల్లుఅర్జున్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది..
 
అల్లుఅర్జున్ కెరీర్ లో పుష్ప 2 సినిమా ఎప్పటికీ నిలిచిపోతుంది.. అలాగే ఈ సినిమాలో డాన్సింగ్ క్వీన్ శ్రీలీల “కిస్సిక్” అనే అదిరిపోయే ఐటమ్ సాంగ్ లో నటించింది.. శ్రీలీల స్టెప్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.. ఆ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయింది.. థియేటర్ లో రికార్డ్స్ క్రియేట్ చేసిన పుష్ప 2..ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఓటీటీ లో సైతం పుష్ప 2 సినిమా ట్రెండింగ్ లో నిలిచింది..అయితే పుష్ప 2 లో దర్శకుడు సుకుమార్ పార్ట్ 3 అద్భుతమైన లీడ్ ఇచ్చారు.. త్వరలోనే పుష్ప పార్ట్ 3 మొదలవుతుంది.. “పుష్ప 3 ది ర్యాంపెజ్” అనే పేరుతో ఆ సినిమా రాబోతుంది..

ఇదిలా వుంటే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుష్ప 2 సినిమా ఇప్పుడు టీవీల్లోకి రాబోతుంది..ఈ నెల 13,14 వ తేదీల్లో దక్షిణాది భాషల్లో రిలీజ్ కాబోతుంది..ఈ నెల 13న తెలుగులో స్టార్ మా లో 5.30 గంటలకు, మలయాళంలో ఆసియా నెట్ 6.30 గంటలకు, కన్నడలో కలర్స్ కన్నడ 7 గంటలకు రిలీజ్ అవుతుంది.. 14 వ తేదీన  స్టార్ విజయ్ టీవీ ఛానెల్ లో 3 గంటలకు ప్రసారం కాబోతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: