మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ చిన్నది అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు అందుకుంది. హ్యాపీడేస్ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఈ చిన్నది సినీ ఇండస్ట్రీకి పరిచయమై దాదాపు 20 ఏళ్లకు పైనే అవుతున్న స్టార్ హీరోయిన్ గా తన హవాను కొనసాగిస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతోంది. ప్రస్తుతం తెలుగు, హిందీలో ఈ చిన్న దానికి ఉన్నంత క్రేజ్ మరెవరికి లేదనడంలో ఇలాంటి సందేహం లేదు.


ఈ చిన్నది హీరోయిన్ గా మాత్రమే కాకుండా ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తూ మంచి గుర్తింపు అందుకుంటుంది. ఇదివరకే కొన్ని సినిమాలలో ఐటమ్ సాంగ్స్ చేసిన ఈ చిన్నది అభిమానులను ఆకట్టుకుంది. స్వింగ్ జరా, ఆజ్ కి రాత్, కావాలయ్యా వంటి ఇతర ఐటమ్ సాంగ్స్ తో కుర్ర కారును తన వైపుకు తిప్పుకుంది. ఇక ఈ చిన్నది తాజాగా అజయ్ దేవ్ గన్, రితేష్ దేశ్ ముఖ్ నటించిన రైడ్-2 సినిమాలోని తేరే నషా పాటలో అద్భుతంగా చిందులు వేసింది. తన పర్ఫామెన్స్ తో ఈ పాటలో అదరగొట్టింది.


జైలర్ సినిమాలో కావాలయ్యా సాంగ్ ను ఆమె మరోసారి గుర్తుకు చేశారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా మే 1వ తేదీన రైడ్-2 సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా.... తమన్న బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ చాలా కాలం నుంచి రిలేషన్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ జంట వివాహం చేసుకోవాలని అనుకున్నట్లుగా అనేక రకాల వార్తలు వచ్చాయి.


అయితే ఏమైందో తెలియదు ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారని చాలా కాలం నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం తమన్న, విజయవర్మ బ్రేకప్ చెప్పుకున్నట్లుగా, ఏవో మనస్పర్ధలు కారణంగా విడిపోయారంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయం పైన తమన్న, విజయ్ వర్మ ఎవరో ఒకరు స్పందిస్తే గాని అసలు విషయం తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: