తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. కానీ వీరందరిలోకెల్లా మెగాస్టార్ చిరంజీవి మాత్రమే మంచి పేరు సంపాదించుకున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి  తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన నీడన  మెగా కుటుంబం నుంచి సామ్రాజ్యమే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుంచి ఇంత మంది హీరోలు స్టార్లుగా ఎదగలిగారు. ఇంతటి పరిస్థితులు రావడానికి ప్రధాన కారకుడు మెగాస్టార్ చిరంజీవి. అలాంటి ఈయన ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత  ఒక క్రమశిక్షణ అలవాటు చేసుకున్నాడు. షూటింగ్లోకి వెళ్ళాడు అంటే తప్పనిసరిగా దర్శక నిర్మాతలు ఏది చెబితే అది పాటిస్తాడు.. వారికి ఎక్కడ కూడా ఎదురు చెప్పడు.

అంతేకాదు సినిమాల విషయంలో చిరంజీవికి ఉన్నంత డెడికేషన్ ఇంకా ఏ హీరోకి ఉండదని చెప్పవచ్చు. అలాగే చిరంజీవి తెలుగు ప్రేక్షకులకు  ఒక కొత్తదనాన్ని చూపించిన నటుడు అని చెప్పవచ్చు. చిరంజీవి కంటే ముందు ఎన్టీఆర్, ఏఎన్నార్, వంటి హీరోలు  ఉండేవారు. వారి కాలంలో డాన్స్ అయిన  సినిమా ఫైట్స్ అయినా ఒకే రకంగా ఉండేవి. కానీ చిరంజీవి వచ్చిన తర్వాత  సరికొత్త డాన్స్, ఫైట్స్ చూపించాడు. ఆయన డాన్స్ కు కోట్లాదిమంది ఫ్యాన్స్ తయారయ్యారు. డాన్స్ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఉండేవారు చిరంజీవి. అయితే ఆయన ఒకసారి  103 జ్వరం వచ్చినా కూడా షూటింగ్ వాయిదా వేసుకోకుండా కంప్లీట్ చేశాడు. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయింది.

ఒక సాంగ్ మినహా అంతా పూర్తయిపోయింది. సినిమా డేట్ కూడా ప్రకటించుకున్నారు. ఇంతలో చిరంజీవికి విపరీతమైన జ్వరం వచ్చింది. ఆయన షూటింగ్ రాకపోతే సినిమా వాయిదా పడుతుంది నిర్మాతలకు కోట్లు నష్టం జరుగుతుందని భావించి  అంత జ్వరంలో కూడా డాక్టర్ ను తీసుకువచ్చి  ఆ సినిమా సాంగ్ పూర్తి చేశారు. ఈ సాంగ్ పూర్తిచేసే సమయంలో ఆయన చాలా సార్లు స్పృహతప్పి పడిపోయారట. అయినా మళ్లీ లేచి సాంగ్ పూర్తి చేసి సినిమా విడుదల అయ్యేలా చేశారని చెప్పవచ్చు. ఆ విధంగా సినిమాపై డెడికేషన్ ఉంది కాబట్టే ఆ చిత్రం అప్పట్లో బ్లాక్ మాస్టర్ హిట్ అయింది. చిరంజీవి ఇంత పెద్ద హీరోగా ఎదగలిగారని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: