త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిన్నది ఒకానొక సమయంలో తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తన సినిమాల ద్వారా ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల మనసులను కట్టిపడేసింది. త్రిషకు విపరీతంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ్, మలయాళం అనే తేడా లేకుండా త్రిష ఎప్పటికప్పుడు ఏదో ఒక సినిమాతో తన ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది. ఇక కొద్ది రోజుల క్రితం తెలుగులో త్రిష సినిమాలు చేయడం మానేసింది. 


చాలా కాలం తర్వాత తెలుగులో త్రిష మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. త్రిష వయసు పెరిగినప్పటికీ ఇంతవరకు వివాహం చేసుకోలేదు. సింగిల్ గానే తన లైఫ్ ను సంతోషంగా కొనసాగిస్తోంది. ఈ క్రమంలోని త్రిషకు సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ బ్యూటీతమిళ్ హీరోతో ఎఫైర్ కొనసాగిస్తుందని అది కూడా వివాహమైన వ్యక్తిని అంటూ అనేక రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఈ వార్తలపై త్రిష ఎప్పుడు రియాక్ట్ అవలేదు. చాలాకాలం తర్వాత త్రిష సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న నెగిటివిటిపై త్రిష ఘాటుగా స్పందించింది. సోషల్ మీడియాలో నెగెటివిటీని ప్రచారం చేసే వారికి నిద్ర ప్రశాంతంగా ఎలా పడుతుందో అంటూ త్రిష ఇన్ స్టాలో రాసుకొచ్చింది. ఇంట్లో ఖాళీగా కూర్చుని ఇతరులపై ఇలా ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు చేయడమే మీ పనా అంటూ అసహనాన్ని వ్యక్తం చేసింది.

ఇలా నెగిటివిటీని ప్రచారం చేసే వారితో కలిసి జీవించే వారి గురించి ఆలోచిస్తే చాలా బాధగా అనిపిస్తుందని త్రిష అన్నారు. ఇలా నెగిటివిటీని ప్రచారం చేయడం ఇకనుంచి అయినా ఆపేయాలంటూ త్రిష సోషల్ మీడియాలో వేడుకున్నారు. త్రిష ఇలా స్పందించిన తర్వాత అయిన నెగిటివ్ గా రూమర్స్ రాకుండా ఉంటాయేమో చూడాలి. నిన్న రిలీజ్ అయిన గుడ్ బాయ్ అగ్లీ సినిమాకి త్రిష డబ్బింగ్ చెప్పకపోవడం వల్లనే ఇలా ఎస్ఎం లో అనేక రకాల విమర్శలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: