ఇండస్ట్రీలో ఉన్నటువంటి డైరెక్టర్లలో ఇంద్రగంటి మోహన కృష్ణ  చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. ఈయన చేసిన చాలా చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈయన ప్రతి సినిమా ఒక అద్భుతమైన పుస్తకం చదివినట్టు సాగుతుంది. అలా మోహనకృష్ణ   చేసిన చాలా సినిమాలు సూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఆ హీరోల కెరియర్ కూడా నిలబెట్టాయి. అలాంటి ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు సినిమాల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు యానిమల్ సినిమా అసలు నచ్చలేదని చెప్పారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చేలా సినిమాలు తీయడంలో మోహన కృష్ణ దిట్ట. 

గ్రహణం అనే చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన ఆ తర్వాత మాయాబజార్ సినిమాతో మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత అష్టాచమ్మతో అద్భుతమైన హిట్ అందుకున్నారు  దీని తర్వాత గోల్కొండ హై స్కూల్ చేసి తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నారు. అంతేకాదు ఈ సినిమా సుమంత్ కెరియర్ లో ఒక అద్భుతమైన సినిమాగా నిలిచింది. అలాంటి మొహాన కృష్ణ  తాజాగా సారంగాపాణి జాతకం అనే సినిమాను తీస్తున్నారు. ఇందులో ప్రియదర్శి హీరోగా చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో మోహన కృష్ణ మాట్లాడుతూ  యాక్షన్ సినిమాలు చూసినప్పుడు ఆ సినిమాలో హీరో ఎందుకు అంతా వైలెంట్ గా ఉన్నాడో దానికి ఒక కారణం తప్పనిసరిగా ఉండాలి.

 కారణం లేకుండా హీరో మగతనం చూపిస్తే సినిమాకు వ్యాల్యూ ఉండదు తనకు వ్యాల్యూ ఉండదు. అంతేకాదు నాకు యానిమల్ సినిమా అసలు నచ్చలేదని, ఈ సినిమాను చూసి నవ్వుకున్నానని చెప్పుకొచ్చారు. పుష్ప మొదటి భాగం మాత్రమే తనకు నచ్చిందని పార్ట్ 2 లో  అల్లు అర్జున్ తనకు తానే హీరోగా వన్ మాన్ షో చేశాడు అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మోహనకృష్ణ మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: