టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి హీరోలుగా పరిచయమైతే మరి కొంతమంది ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీకి పరిచయమై మంచి గుర్తింపు అందుకున్న వారు ఎందరో ఉన్నారు. ఇక సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తాను నటించిన మొదటి సినిమాతోనే నందమూరి కళ్యాణ్ రామ్ ఎంతో మంచి గుర్తింపు అందుకున్నారు. తన నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకున్నాడు.



అనంతరం కొన్ని సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ సినిమాల పరంగా పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. ఇక చాలాకాలం తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ పటాస్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా అనంతరం మరికొన్ని సినిమాలలో నటించినప్పటికీ ఆ సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్ రీసెంట్ గా నటించిన చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.


ఇందులో కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్ గా సాయి మంజ్రేఖర్ నటిస్తోంది. ఈ సినిమాకు శ్రీనివాస్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. కాగా, ఈ సినిమాలో విజయశాంతి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. చాలా కాలం తర్వాత విజయశాంతి పోలీస్ ఆఫీసర్ గెటప్ లో కనిపించి అభిమానులను ఆకట్టుకోనుంది. విజయశాంతి, కళ్యాణ్ రామ్ తల్లి కొడుకుల పాత్రలో అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో తల్లి కొడుకుల సెంటిమెంట్ అభిమానులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 12వ తేదీన జరగనుంది. ఈ సినిమా ఈవెంట్ కార్యక్రమానికి ఎన్టీఆర్ గెస్ట్ గా రానున్నారట. తన సోదరుడి కోసం ఎన్టీఆర్ రంగంలోకి దిగి ఈ సినిమాను సక్సెస్ చేయాలని ఆలోచనతోనే గెస్ట్ గా రాబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించాలని చిత్ర బృందం ప్లాన్ లో ఉన్నారట. ఈ విషయం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: