స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. గంగోత్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హీరో ప్రేక్షకుల మనసులను దోచుకున్నాడు. మొదటి సినిమాతో పెద్దగా సక్సెస్ కాలేకపోయిన తన సినిమాల ద్వారా ప్రేక్షకుల  మనసులను కట్టిపడేశాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక అల్లు అర్జున్ కు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ తన కెరీర్ లో ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించారు. అందులో కొన్ని సినిమాలు సక్సెస్ అవగా... మరికొన్ని సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.



అయినప్పటికీ అల్లు అర్జున్ వరుసగా సినిమాలు చేసుకుంటూ తన ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప-2 సినిమాను తీయగా అది కూడా సక్సెస్ అయింది. ఈ సినిమా అత్యంత ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డులను తిరగరాసింది.

పుష్ప-2 సినిమా విడుదలై చాలా రోజులు అయినప్పటికీ అల్లు అర్జున్ ఇప్పటివరకు సినిమా షూటింగ్ లో మళ్లీ పాల్గొనడం లేదు. అల్లు అర్జున్ తన తదుపరి సినిమాను డైరెక్టర్ అట్లీతో కలిసి తీయబోతున్నారు. AA22 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభించబోతున్నారు. రీసెంట్ గానే బన్నీ పుట్టినరోజు సందర్భంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాను అనుకుంటున్నారు.

అయితే ఈ సినిమాలో నటించడానికి ప్రియాంక చోప్రా నో చెప్పినట్టు టాక్ వినిపిస్తోంది. ప్రియాంక చోప్రా ప్రస్తుతం రాజమౌళి - మహేష్ బాబు కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబి 28 సినిమాలో నటిస్తోంది. ప్రియాంక చోప్రా ప్రస్తుతం బాలీవుడ్, హాలీవుడ్ లో సైతం కొన్ని సినిమా షూటింగ్ లలో బిజీగా ఉంటుంది. ఆ కారణంగానే అల్లు అర్జున్ తో కలిసి సినిమాలో నటించడానికి ఈ చిన్నది నో చెప్పిందట. ప్రస్తుతం ఈ వార్త సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: