ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప - 2 సినిమా గత ఏడాది డిసెంబర్ 5 న విడుదల అయి పాన్ ఇండియా వైడ్ సంచలనం సృష్టించింది.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంచలన విజయం సాధించింది..పుష్ప 2 చిత్రంతో సినిమా హద్దులను చెరిపేసిన అల్లు అర్జున్‌. ఇప్పుడు మరోసారి సంచలనం సృష్టించడానికి సిద్ధం అవుతున్నాడు.ఈ సారి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌లో అదరగొట్టేందుకు సిద్ధం అవుతున్నాడు... అల్లు అర్జున్‌ తన తరువాత సినిమాను స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో చేయనున్నాడు.. తాజాగా ఈ సినిమాపై అధికారికంగా ప్రకటన వచ్చేసింది.కోలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ 'సన్‌ పిక్చర్స్‌' అత్యంత భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్‌ చేస్తుంది. నేడు (ఏప్రిల్ 8 ) అల్లుఅర్జున్ పుట్టినరోజు కావడంతో ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ.. 'AA22' పేరుతో ఈ చిత్రాన్ని మేకర్స్ ప్రకటించారు.

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గతంలో విజయ్‌ హీరోగా వరుసగా మెర్సల్‌, బిగిల్‌, తేరి వంటి చిత్రాలతో సంచలనం సృష్టించాడు... ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లి నటుడు షారుఖ్‌ ఖాన్‌తో జవాన్‌ అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ తెరకెక్కించి అక్కడ కూడా సూపర్‌ హిట్‌ అందకున్నాడు. అలా పాన్‌ ఇండియా రేంజ్‌లో సత్తా చాటి మంచి గుర్తింపు తెచ్చుకున్న సౌత్‌ ఇండియా స్టార్స్‌ కలిసి ఓ భారీ ప్రాజెక్ట్‌ చేస్తుండటంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు పెంచేసుకుంటున్నారు..ఈ సినిమా లో అల్లు అర్జున్ ని దర్శకుడు అట్లీ సరికొత్త గా చూపించనున్నట్లు సమాచారం.. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ మొదటి సారి డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తుంది..అయితే అల్లు అర్జున్ కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ను హీరోయిన్ తీసుకుందాం అని దర్శకుడు అట్లీ అనుకున్నాడట.

జాన్వీ ఇప్పటికే ఎన్టీఆర్ తో దేవర మూవీతో సౌత్ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన 'పెద్ది' చిత్రంలో నటిస్తోంది. ఇప్పటి వరకూ చాలా సినిమాలు చేసినా అద్భుతమైన నటి అన్న ప్రశంసలైతే ఆమెకు ఇంకా రాలేదు.దేవర తో మాత్రం సౌత్ లో మంచి హిట్ అందుకుంది.అయితే జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా అల్లు అర్జున్ వద్దనుకుంటున్నాడట. తనకంటే ఇంకా బెటర్ ఛాయిస్ కు వెళదాం అని దర్శకుడితో చెప్పాడని సమాచారం..తనతో పుష్ప సినిమా చేసినప్పుడు రష్మిక మందన్నాకు పాన్ ఇండియా ఇమేజ్ లేదు తర్వాత సెకండ్ పార్ట్ తో తనకు ప్యాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు లభించింది అని చెప్పుకొచ్చాడని సమాచారం..అవసరమైతే కొత్త హీరోయిన్ తో చేద్దామని బన్నీ చెప్పినట్లు సమాచారం..


మరింత సమాచారం తెలుసుకోండి: