
మొదట జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసి ఆ తర్వాత కొరియోగ్రాఫర్ గా ఎదిగింది. తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా చిత్రాలకు కూడా కొరియోగ్రాఫర్ గా చేస్తూ ఉన్నది. జానీ మాస్టర్ బెయిల్ మీద బయటికి వచ్చి తన ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు. అలాగే కొరియోగ్రాఫర్ శ్రష్టి శర్మ పుష్ప 2 చిత్రం నుంచి చేయడంతో బాగా కలిసొచ్చింది. అలా లేడీ కొరియోగ్రాఫర్ గా తనకంటూ ఒక పేరు సంపాదించిన ఈమె సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్గానే ఉంటుంది.
కెరియర్ పరంగా బాగానే దూసుకుపోతున్నది.ఇటీవలే ఒక కారును కూడా కొనుగోలు చేసినట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ విషయం విన్న అభిమానులు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఉన్నారు. హుందాయ్ కారుని కొనుగోలు చేసినట్లు తెలియజేస్తు తెగ సంబరపడిపోతోంది లేడీ కొరియోగ్రాఫర్. మొదటి ఢీ షో తో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రష్టి మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందిన అమ్మాయి. అయినప్పటికీ కూడా చిన్నవయసులోనే కొరియోగ్రాఫర్ జానీ దగ్గర అసిస్టెంట్ గా చేరింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో ఒక సినిమా కూడా విడుదల అయింది. కానీ జానీ మాస్టర్ , తన భార్య ఇద్దరు కూడా తనని చాలా చిత్రహింసలకు గురి చేశారని కూడా తెలియజేసింది.