టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది క్యూట్ కపుల్స్ ఉన్నారు. అందులో ఒకప్పుడు క్యూట్ కపుల్స్ లిస్ట్ లో ఉన్న సమంత నాగచైతన్య ఒకరు. సమంత, చైతు ప్రేమించి వివాహం చేసుకున్నప్పటికీ ఏవో మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నారు. కేవలం నాలుగు సంవత్సరాల కాలంలోనే వారి వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. నాలుగు సంవత్సరాల పాటు సమంత చైతన్య వారి వైవాహిక జీవితాన్ని చాలా సంతోషంగా గడిపారు. ఇద్దరి మధ్య మనస్పర్ధల కారణంగా ఈ జంట విడాకులు తీసుకొని వేరుగా ఉంటున్నారు.


విడాకుల తర్వాత నాగచైతన్య నటి శోభితను వివాహం చేసుకున్నాడు. సమంత మాత్రం ఎవరిని వివాహం చేసుకోకుండా నాగచైతన్య జ్ఞాపకాలతోనే కాలం గడుపుతోంది. అయితే సమంత కూడా మరో వ్యక్తితో ప్రేమలో ఉందని త్వరలోనే వివాహం చేసుకుంటుందని కొన్ని రకాల వార్తలు వస్తున్నప్పటికీ ఇంతవరకు సమంత ఆ వార్తలపై స్పందించలేదు. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ అవుతుంది.


చైతు సమంత కలిసి ఉన్న సమయంలో వారు ఎంతో ఇష్టంగా హష్ అనే శునకాన్ని దత్తత తీసుకున్నారు. వారు దానిని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. విడాకుల తర్వాత కూడా సమంత చైతు తమ పెంపుడు శునకానికి కో పేరెంట్స్ గా కొనసాగుతున్నారని ఓ రెడిట్ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సమంత చైతు విడాకులు తీసుకున్న తర్వాత వారి పెంపుడు శునకాన్ని సమంత తనతోనే తీసుకువెళ్లింది. కానీ కొన్ని సందర్భాలలో కూడా హాష్ చైతు వద్ద కూడా కొన్ని సందర్భాలలో కనిపించింది.

ఈ క్రమంలోనే సమంత చైతు విడాకులు తీసుకున్నప్పటికీ వారు కో-పేరేంటింగ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుందని ఓ రెడిట్ యూజర్ రాసుకొచ్చాడు. మనుషులు విడిపోయినప్పటికీ మూగజీవాలను దూరం చేసుకోవద్దని తనతో మీరు ఇలానే ప్రేమగా ఉండాలని హష్ కి కోపేరేంటింగ్ చేయాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ వీరిద్దరూ కలిసి కో-పేరేంటింగ్ చేస్తున్నారని తెలిసి అభిమానులు సంతోషపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: