సినిమా ఇండస్ట్రీలో  పెళ్లిలు చేసుకోవడం విడిపోవడం అనేది  ఎప్పటినుంచో జరుగుతున్న తంతు. అంతే కాదు కొంతమంది హీరోలు రెండు పెళ్లిళ్లు చేసుకొని హాయిగా  సంసారం చేసిన  వారు ఉన్నారు. అలా ఇండస్ట్రీలో రెండు పెళ్లిళ్లు చేసుకొని పిల్లల్ని కానీ హ్యాపీగా జీవించిన వ్యక్తుల్లో సూపర్ స్టార్ కృష్ణ మొదటి స్థానంలో ఉంటారని చెప్పవచ్చు. కృష్ణ రెండవ పెళ్లిని  ఆ నిర్మాత, హీరో చాలా వరకు తప్పుబట్టారట. మరి ఆయన ఎవరు వివరాలు చూద్దాం.. సూపర్ స్టార్ కృష్ణ ఇండస్ట్రీకి కౌబాయ్ సినిమాలను పరిచయం చేశాడని చెప్పవచ్చు. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా అన్ని రంగాల్లో రాణించారని చెప్పవచ్చు. ఈయన చేసిన చాలా చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. 

కెరియర్ లో సూపర్ సక్సెస్ అయినటువంటి కృష్ణ వ్యక్తిగత విషయాలకు వస్తే రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. 1961లో వరుసకు మరదలు అయ్యే ఇందిరా దేవిని వివాహం చేసుకున్నారు. వీరికి మంజుల, మహేష్ బాబు, రమేష్ బాబు, పద్మావతి, ప్రియదర్శిని అనే సంతానం ఉన్నారు. ఆ తర్వాత 1969లో నటి విజయ నిర్మలను రెండో వివాహం చేసుకున్నాడు. ఈయన రెండవ పెళ్లి ఇండస్ట్రీలో పెద్ద టాక్ గా నిలిచింది. కృష్ణ రెండో పెళ్లి గురించి తాజాగా మురళీమోహన్ ఒక ఇంటర్వ్యూలో  బయట పెట్టారు.

 కృష్ణ విజయనిర్మలను పెళ్లి చేసుకునే సమయానికి నేను ఇండస్ట్రీలోకి రాలేదు. కృష్ణ నాకు అప్పటికే మంచి స్నేహితుడు. ఇందిరా దేవి మంచి వ్యక్తి అయినా కానీ కృష్ణ తాను  ప్రేమించిన అమ్మాయికి మోసం చేయొద్దని విజయనిర్మలను కూడా పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో నేను అది పెద్ద తప్పని తెలియజేశాను. కానీ కృష్ణ వినకుండా వివాహమైతే చేసుకున్నాడు. విజయనిర్మల కృష్ణ జీవితంలోకి వచ్చాక ఇంకా సక్సెస్ బాటలోకి వెళ్ళాడు. ఇద్దరు ఒకరికి ఒకరు సహకరించుకుంటూ మంచి హిట్స్ అందుకున్నారు. చివరికి విజయనిర్మల గిన్నిస్ బుక్ రికార్డులోకి కూడా ఎక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: