టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అల్లు అర్జున్ 2009 వ సంవత్సరం ఆర్య 2 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా ... సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ కంటే ముందు అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఆర్య అనే మూవీ రూపొంది బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాకు కూడా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఆర్య లాంటి విజయవంతమైన సినిమా తర్వాత అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా కావడం ఆ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించడంతో ఆర్య 2 మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అలా భారీ అంచనాల నడుమ 2009 వ సంవత్సరం విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను వసూలు చేయడంలో విఫలం అయింది. కానీ ఈ మూవీ కి ఆ తర్వాత మాత్రం ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడం మొదలయింది. ఇకపోతే తాజాగా ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్ లో భాగంగా ఈ మూవీ కి అద్భుతమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది. ఇకపోతే ఒక ఏరియాలో ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. అలాగే ఆ ఏరియాలో రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమా ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసి ఆల్ టైం రికార్డును కూడా సృష్టించింది. 

అసలు విషయం లోకి వెళితే ... తాజాగా ఈ మూవీ బృందం వారు ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఈ మూవీ 65 లక్షల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి రీ రిలీజ్ లో భాగంగా ఆల్ టైం రికార్డు కలెక్షన్లను వసూలు చేసినట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: