సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో , హీరోయిన్ కలిసి ఓ సినిమాలో నటించి ఆ సినిమా కనుక మంచి విజయం సాధించినట్లయితే మరోసారి వారి కాంబోలో సినిమా రావాలి అని ఆ హీరో హీరోయిన్ అభిమానులు భావిస్తూ ఉంటారు. ఇక అలాంటి కాంబోలో సినిమా కనక సెట్ అయినట్లయితే ఆ మూవీ పై మొదటి నుండి ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొంటాయి. ఇకపోతే కొంత కాలం క్రితం మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీ లీల హీరోయిన్గా ధమాకా అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ వచ్చిన విషయం మనకు తెలిసిందే.

మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాలో రవితేజ తన నటనతో ఆకట్టుకోగా , శ్రీ లీల తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ఈ మూవీ లో శ్రీ లీల తన డాన్స్ తో కూడా ప్రేక్షకులను కట్టి పడేసింది. ఓవరాల్ గా ఈ మూవీ లో రవితేజ , శ్రీ లీల జంటకు మంచి రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది. ఇకపోతే ప్రస్తుతం రవితేజ "మాస్ జాతర" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీలో రవితేజకు జోడిగా శ్రీ లీల నటిస్తోంది. ధమాకా మూవీ తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి తూ మేరా లవర్ అంటూ సాగబోయే లిరికల్ వీడియో విడుదలకు సంబంధించి ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్ లో రవితేజ , శ్రీ లీల ఇద్దరు అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పు వేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. ఈ పోస్టర్ చూస్తూ ఉంటే ధమాకా సినిమా మాదిరి ఇందులో కూడా శ్రీ లీల తన డ్యాన్స్ తో , అందాలతో రెచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ధమాకా తో రవితేజ , శ్రీ లీల కు మంచి విజయం దక్కింది. మరి మాస్ జాతర మూవీతో వీరిద్దరికి ఎలాంటి విజయం దక్కుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: