
టాలీవుడ్ ఇండస్ట్రీలో .. బాలీవుడ్ ఇండస్ట్రీలో.. మలయాళం ఇండస్ట్రీ లో.. కోలీవుడ్ ఇండస్ట్రీలో.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సాయి పల్లవి గురించి అందరికి తెలిసిందే. సాయి పల్లవి ఎవర్ గ్రీన్ బ్యూటీ. తనదైన స్టైల్ లో సినిమాల్లో నటిస్తూ ముందుకు వెళుతుంది . మరి ముఖ్యంగా చాలామంది స్టార్స్ అటెన్షన్ గ్రాబ్ చేసింది . సాయి పల్లవి పెద్ద హీరోలతో నటించాలి అనే ఛాన్స్ కోసం వెయిట్ చేసే మూమెంట్ నుంచి సాయి పల్లవితో మేము నటిస్తే బాగుంటుంది అంటూ స్టార్ హీరోలు వెయిట్ చేసే స్థాయికి ఎదిగిపోయింది . నిజంగా ఇది ఆమె సక్సెస్ అనే చెప్పాలి . బాలీవుడ్ ఇండస్ట్రీలో రామాయణ చేస్తుంది .
అంతేకాదు సాయి పల్లవి కోలీవుడ్లో రెండు సినిమాలు కమిట్ అయింది. తెలుగులో రీసెంట్ గానే తండేల్ సినిమాతో హిట్ అందుకుంది. ప్రసెంట్ ఈ హీరోయిన్ రేంజ్ వేరే లెవల్ అని చెప్పాలి. ఒకప్పుడు కోటి తీసుకునే సాయిపల్లవి..ఇప్పుడు 10 కోట్లు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తుందట. నిజంగా సాయిపల్లవి అందరికి ఒక బిగ్ ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. చూద్దాం ఫ్యూచర్ లో సాయి పల్లవి ఇంకెన్ని విజయాలు తన ఖాతాలో వేసుకుంటుందో..???