ప్రజెంట్ మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నా మూవీ "పెద్ది".  రామ్ చరణ్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్గా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు మెగా అభిమానులు . గేమ్ ఛేంజర్ తర్వాత ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేసారు.  కచ్చితంగా ఈ సినిమాతో హిట్ కొట్టాల్సిన బాధ్యత రామ్ చరణ్ పై ఉంది . లేకపోతే డెఫినెట్గా ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది. అందుకే చరణ్ కూడా ఈ సినిమా విషయంలో చాలా పక్కాగా ముందుకు వెళ్తున్నారు.


కాగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో రామ్ చరణ్ "పెద్ది" సినిమాకి సంబంధించి ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారట . ఈ సినిమాలో ఒక స్టార్ హీరోని గెస్ట్ పాత్రలో చూపించబోతున్నారట . అది కూడా రామ్ చరణ్ డిసప్పాయింట్ అయిపోయిన మూమెంట్లో ఆయనను ఎంకరేజ్ చేస్తూ ఆ స్పెషల్ రోల్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారట . ఆయన మరెవరో కాదు "రవితేజ". టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న రవితేజ ఎవరు సపోర్ట్ లేకుండా ఇంత పెద్ద స్థానానికి ఎదిగాడు అన్న విషయం అందరికీ తెలుసు .



సేమ్ సినిమాలో ఆ సిచువేషన్ చెప్పే విధంగా బుచ్చిబాబు సన రవితేజను ఇంట్రడ్యూస్ చేయబోతున్నారట . గతంలో రవితేజ - చిరంజీవి సినిమాలో నటించి మెప్పించాడు.  అన్నయ్య సినిమాలో బ్రదర్ క్యారెక్టర్ లో మెప్పించాడు. ఇక వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా అదే పర్ఫామెన్స్ ఇచ్చాడు . ఒకప్పుడు చిరంజీవితో నటించిన రవితేజ ఇప్పుడు కొడుకు రామ్ చరణ్ తో నటిస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ ఈ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.  రవితేజని ఎలా చూపించబోతున్నాడు బుచ్చి బాబు సనా  అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..??

మరింత సమాచారం తెలుసుకోండి: