
వీళ్ల కాంబోలో వచ్చిన అఖంద ఎంత సూపర్ డూపర్ హిట్ అయింది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు అఖండ 2 సెట్స్ పై ఉంది. అఖండ 2 లో స్పెషల్ సాంగ్ లో ఇరగదీయబోతుందట పూర్ణ. నిజానికి అఖండ సినిమాలో పూర్ణ ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో మెరిసింది . అయితే బోయపాటి శ్రీను అదే క్యారెక్టర్ ని కంటిన్యూ చేస్తూ అఖండ 2 లో ఆ క్యారెక్టర్ తో స్పెషల్ సాంగ్ లో చిందులు వేయించబోతున్నారట . అలా పూర్ణ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్లో మెరవబోతుంది.
పూర్ణ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. అందుకే డైరెక్టర్స్ ఆమె కి అవకాశాలు ఇస్తూ ఉంటారు. హీరోయిన్ కటౌట్ ఉన్న పూర్ణ స్పెషల్ సాంగ్ లో మెరిస్తే కుర్రాళ్ళు అరుపులు కేకలు వేయచ్చు అది అందరికీ తెలిసిందే . బాలయ్య సినిమాలో అంటే మరింత మాస్ గా ఉంటుంది అంటూ జనాల ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది . చూడాలి మరి పూర్ణాకి అఖండ 2 ఎలాంటి సక్సెస్ ఇస్తుందో..??