అల్లు అర్జున్ .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు . సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్లింగ్ కి గురి అవుతున్న పేరు కూడా ఇదే అని చెప్పాలి.  కాగా అల్లు అర్జున్ తన కెరీర్లో పుష్ప సినిమా కోసం ఎన్ని తిప్పలు పడ్డాడో అన్న విషయం అందరికీ తెలిసిందే . ఇప్పుడిప్పుడే ఆ ట్రోలింగ్  నుంచి బయటికి వస్తున్నాడు .కాగా ఇప్పుడు అల్లు అర్జున్ - అట్లీ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . త్వరలోనే ఈ సినిమా సెట్స్ పై కి రాబోతుంది . ఈ క్రమంలోనే సినిమాలో హీరోయిన్గా ఎవరిని చూస్ చేసుకున్నారు అనే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. 


కొంతమంది సమంత అంటుంటే కొంతమంది రష్మిక అని.. మరి కొంతమంది ఆలియా భట్ అని మరి కొంతమంది ప్రియాంక చోప్రా అని ఇలా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి . అయితే సమంత - జాన్వికపూర్ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు అంటూ స్ట్రాంగ్ టాక్ వినిపించింది . కానీ ఇద్దరు హీరోయిన్ లని  బన్నీ నే రిజెక్ట్ చేశారట . సమంతకి ఇప్పుడు అంత సీన్ లేదు. విడాకుల తరువాత మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. అందుకే రిజెక్ట్ చేసి ఉండచ్చు. ఇక జాన్వీ కపూర్ - బుచ్చిబాబు - రామ్ చరణ్ సినిమాలో చేస్తుంది . అందుకని ఆ బ్యూటీని వద్దు అని అనుంటాడు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.

 

ఫ్రెష్ హీరోయిన్ అయితే కంటెంట్ కి బాగుంటుంది అంటూ ఆ ఇద్దరు హీరోయిన్స్ ని రిజెక్ట్ చేసారట బన్నీ. సమంత ఎన్నో సందర్భాలలో అల్లు అర్జున్ నే నా ఇన్స్పిరేషన్ అని చెప్పింది మరి అలాంటి హీరోయిన్ బన్నీ ఎలా రిజెక్ట్ చేశాడు అంటున్నారు జనాలు . జాన్వీ కపూర్ ఇప్పుడిప్పుడే స్టార్ గా మారుతుంది . ఆ హీరోయిన్ రిజెక్ట్ చేస్తే ఫ్యూచర్లో మరొకసారి ఆ హీరోయిన్ బన్నీ తో నటిస్తుందా..? అనేది క్వశ్చన్ మార్క్..ఏమో అల్లు అర్జున్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడో కానీ ఆయన పేరు మాత్రం సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోళ్లింగ్ కి గురవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: