ప్రముఖ నటి రేణు దేశాయి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె బద్రి అనే సినిమాతో నటిగా కెరియర్ను మొదలు పెట్టింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరో గా నటించాడు. ఈ సినిమా సమయంలోనే పవన్ మరియు రేణు దేశాయ్ మధ్య పరిచయం ఏర్పడింది. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ , రేణు దేశాయ్ కాంబోలో జానీ అనే మూవీ వచ్చింది. ఈ సినిమా సమయంలో వీరి ప్రేమ మరింత బలపడింది. ఆ తర్వాత వీరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉంది. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వీరు చట్టబద్ధంగా విడాకులు తీసుకుని విడిపోయారు.

ఇక విడిపోయాక పవన్ మరో పెళ్లి చేసుకోగా , రేణు దేశాయ్ మాత్రం తన పిల్లలను చూసుకుంటూ ఉండిపోయింది. రేణు దేశాయ్ మరో పెళ్లి చేసుకోలేదు. దానితో అనేక మంది అనేక సందర్భాలలో రేణు దేశాయ్ రెండో పెళ్లి గురించి అనేక వార్తలను ప్రచురించారు. దానిపై ఆమె కూడా అనేక సందర్భాలలో దానికి కౌంటర్ కూడా ఇచ్చింది. ఇకపోతే తాజాగా రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ అనేక విషయాల గురించి మాట్లాడింది. అలాగే తన రెండో పెళ్లి గురించి మాట్లాడింది.

కానీ తాను మాట్లాడిన అన్ని విషయాల కంటే కూడా సోషల్ మీడియాలో తన రెండవ పెళ్లికి సంబంధించిన విషయాలు ఎక్కువ వైరల్ అవుతూ ఉండడంతో తాజాగా ఈమె తన సోషల్ మీడియా వేదికగా తాజాగా స్పందిస్తూ ... అనేక మంది కి నా రెండవ పెళ్లిపై చాలా ఆసక్తి ఉంది. నేను తాజా ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికరమైన విషయాలను మాట్లాడాను. వాటన్నింటినీ పక్కన పెట్టి నా రెండవ పెళ్లి విషయాన్ని హైలెట్ చేస్తున్నారు. ఈ 44 ఏళ్ల మహిళ రెండవ వివాహం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అంటూ తాజాగా రేణు దేశాయ్ తన రెండవ పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: