
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటలలో ఒకరు అయినటువంటి విశ్వక్ సేన్ తాజాగా లైలా అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి ఘోరమైన నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ భారీ డిజాస్టర్ ను అందుకుంది. ఇకపోతే సందీప్ కిషన్ కొంత కాలం క్రితం మజాకా అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ పై ప్రేక్షకులు పర్వాలేదు అనే స్థాయి అంచనాలు పెట్టుకున్నారు. అలా పర్వాలేదు అనే స్థాయి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. ఇకపోతే కిరణ్ అబ్బవరం కొంత కాలం క్రితం దిల్రూబా అనే సినిమాతో ప్రేక్షకల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కూడా భారీ డిజాస్టర్ అయ్యింది. ఇకపోతే తాజాగా సిద్దు జొన్నలగడ్డ "జాక్" అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ విడుదల ఆయన ఈ సినిమాకు కూడా విడుదల అయిన మొదటి రోజే నెగటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమాకు కూడా మంచి కలెక్షన్లు ప్రస్తుతం దక్కడం లేదు. దానితో ఈ మూవీ కూడా డిజాస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.