
విక్కీ కౌశల్ హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా రూపొందిన ఛావా సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ రావడంతో ఈ సినిమా మొదటి రోజు 33.01 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. సల్మాన్ ఖాన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా రూపొందిన సికిందర్ సినిమాకు విడుదల అయిన ఈ మూవీ కి నెగిటివ్ టాక్ వచ్చింది. అయినా కూడా ఈ మూవీ కి మొదటి రోజు 30.06 కోట్ల కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. స్కై ఫోర్స్ సినిమాకి మొదటి రోజు 15.3 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. తాజాగా సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన జాట్ మూవీ విడుదలైన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు మొదటి రోజు 9.62 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. దేవ మూవీ కి మొదటి రోజు 5.78 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ది డిపార్ట్మెంట్ మూవీ కి మొదటి రోజు 4.03 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. బడాస్ రవి కిరణ్ మూవీ కి మొదటి రోజు 3.52 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఎమర్జెన్సీ మూవీ కి మొదటి రోజు 3.11 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఫతే మూవీ కి మొదటి రోజు 2.61 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.