
కాజల్ అగర్వాల్ , చిరంజీవి హీరోగా రూపొందిన ఖైదీ నెంబర్ 150 సినిమాలో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత చిరంజీవి హీరోగా రూపొందిన ఆచార్య సినిమాలో కూడా హీరోయిన్గా నటించింది. కానీ సినిమాలో ఈమె పాత్రను మాత్రం ఈ సినిమా నుండి తొలగించారు. ఇక బాలకృష్ణ హీరోగా రూపొందిన భగవంత్ కేసరి సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించింది. ఇది ఇలా ఉంటే నాగార్జున హీరోగా రూపొందిన రగడ సినిమాలో ప్రియమణి స్థానంలో కాజల్ ను తీసుకోవాలి అని మొదట ఈ మూవీ బృందం వారు అనుకున్నారట. కానీ చివరి నిమిషంలో అది కుదరలేదట. అలాగే నాగార్జున హీరోగా రూపొందిన ది ఘోస్ట్ మూవీ లో హీరోయిన్గా ఈ బ్యూటీని మొదట ఈ సినిమాలో హీరోయిన్గా అనుకున్నారట. కానీ అది చివరి నిమిషంలో కుదరలేదట. అలా నాగార్జున పక్కన రెండు సార్లు కాజల్ కి ఛాన్స్ వచ్చిన అవి మిస్ అయినట్లు తెలుస్తుంది.