
చిరంజీవి హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో అశ్వినీ దత్ ఓ మూవీ ని నిర్మించాలి అని అనుకున్నాడట. అందులో భాగంగా చిరంజీవిని సంప్రదించగా ఆయనగా అందుకు ఓకే చెప్పాడట. ఇక గోపాల్ ని సంప్రదించి చిరంజీవి మా బ్యానర్ లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నువ్వు ఒప్పుకుంటే నీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా మూవీని రూపొందిస్తాం అని అన్నాడట. దానికి ఆయన కూడా ఓకే చెప్పడంతో చిన్న కృష్ణ దగ్గర ఒక కథ ఉంది. అది నచ్చితే దానితో చిరంజీవి హీరోగా సినిమా చేద్దాం అన్నాడట. దానితో గోపాల్ , చిన్ని కృష్ణ దగ్గర ఉన్న కథను విన్నాడట. కానీ ఆ కథ ఆయన అప్పటికే తెరకెక్కించిన సమరసింహారెడ్డి , నరసింహ నాయుడు సినిమా మాదిరి ఫ్యాక్షన్ ఓరియంటెడ్ కథ కావడంతో అలాంటి కథతో ఆయన సినిమా చేయద్దు అనుకున్నాడట.