
కేవలం ఒకే ఒక్క అమ్మాయిని మాత్రమే అల్లు అర్జున్ ఇన్ స్టాలో ఫాలో అవుతున్నారు. అది కూడా తన భార్య స్నేహారెడ్డిని కావడం విశేషం. ఒక్క స్నేహ రెడ్డిని తప్పితే అల్లు అర్జున్ మరో వ్యక్తిని ఇన్ స్టాలో ఫాలో అవడం లేదు. అల్లు అర్జున్ తన భార్యను మాత్రమే ఫాలో అవడానికి గల కారణం స్నేహ రెడ్డి అని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. తన భార్య ఎవరిని ఫాలో అవ్వోద్దని కండిషన్ పెట్టినట్లుగా సమాచారం అందుతుంది. తనని మాత్రమే ఫాలో అవ్వాలని తనని తప్పితే ఎవరిని ఫాలో అయిన సీరియస్ యాక్షన్ ఉంటుందని స్నేహ రెడ్డి అల్లు అర్జున్ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారట.
అందువల్లనే అల్లు అర్జున్ ఎవరిని కూడా ఇన్ స్టాలో ఫాలో అవ్వడం లేదు. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లితో కలిసి AA 22 సినిమా షూటింగ్ లో త్వరలోనే పాల్గొనబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నారు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాను హీరోయిన్ గా అనుకుంటున్నారట. మరి ఈ బ్యూటీ అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనే సందేహంలో మేకర్స్ ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.