
సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో మరో క్రేజీ సీక్వల్ మూవీ జైలర్ 2 .. ఈ సినిమా కోసం రజనీకాంత్ అభిమానుల తో పాటు సాధారణ సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు .. ఇప్పటికే దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో వచ్చిన భారీ హీట్ మూవీ జైలర్ కు సీక్వెల్ గా అనౌన్స్ అయిన ఈ సినిమా పై ఊహించ ని రేంజ్ లో అంచనాలు ఉన్నాయి .. ఇప్పటి కే రజనీకాంత్ , లోకేష్ కగకరాజ్ తో కూలి సినిమా ను పూర్తి చేసి రీసెంట్ గానే జైలర్ 2 సినిమా షూటింగ్ లో బిజీ కాబోతున్నారు .. అయితే ఇప్పుడు ఈ సినిమా ఫుల్ స్వింగ్లో షూటింగ్ జరుపుకుంటుంది ..
ప్రజెంట్ నెల్సన్ క్రేజీ కామెడీ సీన్స్ తెరకెక్కిస్తుండ గా .. అలాగే రజినీకాంత్ ఫ్యామిలీ సీన్స్ తన మనుమడు , రమ్యకృష్ణ లపై నడిచే సన్నివేశాలు ప్రస్తుతం నడుస్తున్నాయి .. అయితే ఇప్పుడు ఈ సినిమా లో నెల్సన్ కామెడీ ఏవిధంగా చూపిస్తారో చూడాలి .. జైలర్ లో రజనీకాంత్ , యోగు బాబు తో వచ్చిన కామెడీ సీన్స్ ధియేటర్లో ప్రేక్షకులకు నవ్వులు పూయించాయి .. ఇక ఇప్పుడు జైలర్ 2 లో కూడా నెల్సన్ అదే స్థాయి లో కామెడీ ని పండించడాని కి రెడీ అవుతున్నాడు . అలాగే ఈ సినిమా కి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు .. అదే విధంగా సన్ పిక్చర్స్ వారు ఈ సినిమా ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే .. ఇక మరి ఈ సినిమా తో నెల్సన్ , రజినీకాంత్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి ..